సింపుల్ గా బరువు ఇలా తగ్గించుకోండి

ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం మీద శ్రద్ద తగ్గి ,తిండికి కంట్రోల్ లేక అధిక బరువుతో బాధపడుతున్నాం ,అందుకే ఇప్పుడు మనంబరువు ఎలా తగ్గచ్చో ఇక్కడ చూద్దాం ,అధిక బరువుతో చాలా సమస్యలొస్తాయి. దీనికి బాడీలో శరీర కొవ్వు ఎక్కువగా ఉండడం. దీనిని తగ్గించుకోవాలంటే వారి డైట్‌, డెయిలీ రొటీన్‌లో కొన్ని మార్పులు చేయాలి. చాలా మంది భోజనం చేశాక చల్లని నీరు తాగుతుంటారు. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. కానీ, అలా చేయొద్దు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.తిన్న తర్వాత చల్లని నీరు బదులు గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు.

705-entry-0-1700458768.jpg

ఈ విషయాన్ని పోషకాహార నిపుణుడు మున్‌మున్ గనేరివాల్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. దీని వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుందని ఆమె చెబుతున్నారు. గోరువెచ్చని నీరు తాగడం మంచిదని తెలిసినప్పటికీ ఎక్కువమంది ఫాలో అవ్వరు.ఆయుర్వేదం ప్రకారం, ఫ్రిజ్ నీరు తాగడం మంచిది కాదని మున్‌మున్ చెబుతున్నారు. ఎందుకంటే, ఇది జీర్ణాశయ అగ్నిని తగ్గిస్తుంది. దీని కారణంగా, ఆహారం జీర్ణమవ్వదు. జీవక్రియ మందగిస్తుంది.అదే విధంగా, గోరువెచ్చని నీరు తాగితే జీవక్రియని పెరుగుతంది. కాబట్టి, ఉదయాన్నే నిద్రలేచాక వెంటనే గోరువెచ్చని నీరు తాగడం మంచిది. దీని వల్ల సులభంగా జీర్ణమవుతుంది. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.వేడి నీరు తాగడం వల్ల కొవ్వు చిన్న ముక్కలుగా చేసి జీర్ణవ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. అంతేకాకుండా, భోజనానికి ముందు వేడి నీటిని తాగితే మన కడుపు నిండడమే కాకుండా, క్యాలరీలని తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది.