ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంపొందాలి అనుకుంటే ఇవి ఉండాలిసిందే
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కోటిగా నెరవేర్చే పనిలో పడింది. ఎన్నికల వేళ టిడిపి, జనసేన, బిజెపి కూటమి 'సూపర్ 6'పేరిట ప్రజలకు పలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన కూటమి హామీల అమలుకు సిద్దమయ్యింది. ఈ క్రమంలో ఇవాళ ఎన్డిఏ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయులు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కీలక ప్రకటన చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద, మద్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పంపిణీ స్కీమ్ హామీని ప్రారంభించనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే దీపావళి పండగరోజే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చినమహాశక్తి పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ వుంది. దీనితోనే సూపర్ సిక్స్ హామీల అమలును ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనుంది కూటమి ప్రభుత్వం. అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. ఈ కార్డు కలిగిన కుటుంబాల్లో మహిళల పేరిట ఈ ఫ్రీ సిలిండర్ల పంపిణీ చేపట్టనున్నారు. దీపావళి పండగపూట స్వయంగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి.
Comments
0 comment