బాబు నీ విజన్ కు జోహార్లు ,డ్రోన్లతో మందులు ఆహరం
సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబకు ఎవరూ సాటి రారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి సిఎంగా ఐదేళ్లు, ఇప్పుడు కూడా ఆయన ప్రజల ప్రయోజనాల కోసం సాంకేతికను వాడుకునే విషయంలో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారు. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన సందర్భంగా ఆయన అహర్నిశలూ ప్రజల క్షేమం కోసం, వారికి సత్వరంగా సహాయం అందించడం కోసం తపన పడ్డారు. విజయవాడలోని ముంపు ప్రాంతాలను చేరుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా కూడా చేరుకోలేని ముంపు ప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు ఆయన డ్రోన్ లను వినియోగించారు. వాటి ద్వారా అహారం, నిత్యావసరాలు, అత్యవసర మందుల పంపిణీ జరిగేలా చూశారు. బహుశా ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు డ్రోన్ల వినియోగం దేశంలో ఇదే మొదటి సారి కావచ్చు. ఇటీవలి కాలంలో డ్రోన్ల ప్రయోజనం, ఉపయోగాల గురించి పదే పదే చెప్పిన చంద్రబాబు సరిగ్గా అవసరమైన సమయంలో వాటిని సంపూర్ణంగా వినియోగించి ప్రజలను ఆదుకున్నారు.
కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడి ద్వారా ఈ ఆపత్సమయంలో డ్రోన్లను రాష్ట్రానికి రప్పించి, సరైన సమయంలో సమర్ధవంతంగా వాటి సేవలను వినియోగించుకున్నారు. డిజాస్టర్ హెల్స్ కోసం తొలిసారిగా డ్రోన్లను రంగంలోకి దింపి సకాలంలో బాధితులను ఆదుకున్నారు. ఆయన విజన్ కు, ప్రజలకు కష్ట సమయంలో అండగా నిలవడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోని పట్టుదలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Comments
0 comment