బిగ్ బాస్ 8 గురించి శుభశ్రీ మాటల్లో

శుభశ్రీ రాయగురు గురించి టాలీవుడ్‌లో తెలియ‌నివారుండ‌రు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 7 ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఈ షో ద్వారా మంచి పేరు సంపాదించుకోవ‌డ‌మే కాకుండా సినిమాల్లో కూడా రాణిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అప్ కమింగ్ సినిమా ' ఓజీ ' లో తను ఓ ముఖ్య పాత్రను చేస్తుమ్నట్టు శుభశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శుభశ్రీ ..ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. రీసెంట్‌గా కాకినాడ కాజా అంటూ తన వొంపు సొంపులు, డ్యాన్స్‌తో మాస్‌ను ఊపేసింది శుభశ్రీ. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్-8 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. మీ ఫేవరెట్ ఎవరు? విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారంటూ అడుగగా.. రోహిణి ఆట చూసి ఫిధా అయ్యాను.. తనని జీరో అని అన్నవాళ్ళకి గెలిచి చూపించింది. తను ఈ సీజన్ విన్నర్ అయితే బాగుంటుంది. రోహిణి ఆట చూసి చాలామంది ఇన్ స్పైర్ అవుతారు.‌నిజంగా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి. ఆమెకి ఓట్ చేయండి. అలాంటి జెన్యున్ కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చెయ్యండి. రోహిణి లాంటి వాళ్ళు ఇలాంటి షోలోకి రావాలి. అలాంటి వారిని గుర్తించాలని శుభశ్రీ అంది‌. ఇక నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని , గౌతమ్ కూడా బాగానే ఆడుతున్నాడంటు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో ఎంతో నేర్పిస్తుంది. జనాలకు తెలియాలంటే అది ఓ మంచి ప్లాట్ ఫామ్ అని శుభశ్రీ చెప్పుకొచ్చింది.