బంగాళాఖాతం లో మరొక అల్ప పీడనం 5 వ తేదీ నుండి భారీ వర్షాలు
తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. గత వంద సంవత్సరాలలో ఇంత భారీ వర్షాలు వచ్చిన సందర్బం లేదు. ఈ నెల 5న అంటే గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ వాసులను మరో మారు ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కృష్ణానది ఉప్పొంగింది. ప్రకాశం బ్యారేజిలో భారీ ప్రవాహం కొనసాగుతుంది. కృష్ణానది నీరు సముద్రంలో పూర్తిగా కలవడం లేదు. సోమవారం అమవాస్య కావడంతో సముద్ర కెరటాలు భారీగా రావడంతో సముద్రంలోకి నీరు చేరడం లేదు. ఈ కెరటాలవల్ల నీళ్లు కలవకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అమవాస్య రోజు సముద్రంలో అలజడి ఉంటుంది. ఈ అలజడి తీర ప్రాంతవాసులకు కునుకు లేకుండా చేసింది. మంగళవారం నుంచి కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రంలోకి ఇంకే అవకాశమున్నప్పటికీ గురువారం మరో అల్పపీడనం రానుందని వచ్చిన హెచ్చరికతో ఎపి వాసులను మరింత ఆందోళనకు గురి చేసింది. ఈ హెచ్చరిక ప్రభావం తెలంగాణలో కాస్త తక్కువే ఉంది. తెలంగాణలోని ఎనిమిదిజిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సెలవు పెట్టరాదని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతి కుమారి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలని ఆమె ఆదేశించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మొత్తం 11 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Comments
0 comment