చేబ్రోలు లో విజయవంతమైన "గ్రామ సభ"

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి  ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, గౌరవ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు కూటమి నాయకులు విజయవంతం గా నిర్వహించారు,అసలు దశాబ్దం  కిందట ఈ వ్యవస్థ ఉండేది. గ్రామం మధ్యలో గ్రామ సభ ఏర్పాటు చేసేవారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేవారు. ప్రజలకు ఏం అవసరమో గుర్తించేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. పంచాయితీల స్థానంలో సచివాలయాలు వచ్చాయి. ప్రభుత్వ సిబ్బంది స్థానంలో వాలంటీర్లు వచ్చారు. ఆ రెండు వ్యవస్థలలో పంచాయితీ వ్యవస్థ ఉత్సవ విగ్రహంగా మారింది. సర్పంచులు సైతం ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. అయితే దాని నుంచి పంచాయితీలను, సర్పంచులను బయట పడేసేందుకు పవన్ కళ్యాణ్  రంగంలోకి దిగారు డిప్యూటీ సీఎం పవన్, పాత పంచాయతీ విధానాన్ని తెరపైకి తెచ్చి వాటికి పూర్వ వైభవం తేవాలని భావించారు. అందుకే గ్రామసభల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజక వర్గం, గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో కూటమి నాయకులు ఆద్వర్యం లో గ్రామా సభ విజయవంతంగా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో...గ్రామ ప్రజలు వారికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు పై మాట్లాడుతూ ,గ్రామంలో అవసరమయ్యే డంపింగ్ యార్డ్ ,స్మశాన వాటికలు అభివృద్ధి, పంటకాల్వలు పూడిక తీసే పనులు,నూతన మంచి నీటి ట్యాంకులు నిర్మాణాలు ,మొదలగు అభివృద్ధి పనులు కొరకు చర్చించారు ఈ కార్యక్రమంలో నియోజక వర్గ జనసేన నాయకులు ఓదూరి నాగేశ్వరావు,జనసేన నాయకులు చల్ల చినబాబు, ఓదూరి కిషోర్ ,ఓరుగంటి పెద్దకాపు, నక్క తాతీయులు ,దమ్ము చిన్నా,అల్లం దొరబాబు,సూరిశెట్టి జయకృష్ణ,వనిమిని బాలకృష్ణ,ఓరుగంటి చిన్ని, చల్ల కామేశ్వరావు ,  చేదులూరి  త్రిమూర్తులు ,టీడీపీ నాయకులూ ఓరుగంటి వీరబాబు,దూళ్ల లచ్చబాబు ,ఓరుగంటి నానాజీ,మట్లనాగేంద్ర,బీజేపీ నాయకులు పోసిన కోదండం  గ్రామ సర్పంచ్ ,మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు 

సీనియర్ జర్నలిస్ట్ : మురళి మోహన్