చంద్రబాబు ఇంటికి అందుకే వెళ్ళాను : జోగి రమేష్
జోగి రమేష్ ... వైసీపీ ప్రభుత్వం లో జగన్ దగ్గర మెప్పుకోసం విచ్చల విడి తనం తో ...నోటికొచ్చిన బూతుల పదజాలంతో చంద్రబాబు ,లోకేష్ పవన్ లను ఏకరువు పెట్టిన మాజీ మంత్రి ,అసలు జోగి రమేష్ ,కొడాలినాని,పేర్ని నాని ,రోజా ,అంబటి ఇలా కొందరికి మంత్రి పదవులు చంద్రబాబు ని తిట్టడానికే అన్నట్టు ఆంధ్రప్రజలకు అనిపించేది అంటే అతిశయోక్తి కాదు ,అసలు ప్రెస్ మీట్ అంటే వైసీపీ లో మంత్రులు చంద్రబాబుని ,పవన్ ని ,లోకేష్ ని బూతులతో తిట్టడానికే అన్నట్టు ఉండేవి,అలాంటిది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 11 సీట్లకే ఆంధ్ర ప్రజలు పరిమితం చేసేసరికీ దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ ... మూలాన కూర్చున్నారు,అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు యాధస్థితికి వచ్చాయా ?అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో బూతులతో ఓ రేంజ్ లో చెలరేగిపోయిన మాజీ మంత్రులు మాటలు అంత అగౌరవప్రదంగా వుండేవి .... కాదు కాదు అంత గౌరవప్రదంగా ఉండేవి ,ఎంత గౌరవప్రదంగా అంటే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు టీవీ దగ్గర ఉంటే టీవీలు ఆఫ్ చేసేసే అంత గా అంటే అతిశయోక్తి కాదేమో కాదంటారా .మరి కర్మ ఫలం తిరిగి రాక మానదు అందుకే జోగి రమేశ్ కు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తున్నాయి... ముఖ్యంగా గతంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా తీసుకోవడంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఆయన కుమారుడు రాజీవ్ అరెస్టు కాగా.. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయన్ను పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆయనపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడికి ఎందుకు వెళ్లారు, ఎవరు పంపించారు, దాడికి ఎవరితో కలిసి వెళ్లారు, అక్కడ ఎవరు ఏం చేశారన్న అంశాలపై పోలీసులు ప్రశ్నలు వేశారు. వాటికి జోగి రమేశ్ కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చి బయటికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను ఆయన చెప్పుకొచ్చారు . పోలీసు విచారణలో కోర్టులోనే అన్నీ తేల్చుకుంటానని జోగి రమేశ్ చెప్పారట .చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు తనను ప్రశ్నించినట్లు జోగి రమేశ్ తెలిపారు. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో చలించిపోయి చంద్రబాబు ఇంటికి నిరసన తెలిపేందుకు వెళ్లినట్లు జోగి రమేశ్ తెలిపారు. 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబుకు అయినా చెపుదామని వెళ్ళానన్నారు. అయినా మంచి చెప్పాలని మాత్రమే వెళ్ళానన్నారు. క్షణికావేశంలో మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. దీనికి ప్రతిగా ఇప్పుడు తనపై, కుమారుడిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని జోగి రమేశ్ తెలిపారు. అగ్రిగోల్డ్ భూములపై స్పందిస్తూ మీరు ఏ విధంగా కొనుగోలు చేశారో మేము అలాగే కొనుగోలు చేశామన్నారు. తనపై కక్ష సాధింపు ఉండొచ్చు కాని తన కుమారుడిపై అమెరికాలో మంచి ఉధ్యోగం, చదువు ఉన్న తన కుమారుడిపై ఇలా చేయటం సబబేనా అని ప్రశ్నించారు.ఇదిలా ఉంటే నీకొడుకు పనికిమాలిన పనులు చేసి అమెరికాలో ఉంటే చట్టం వర్తించదా ?అమెరికాలో వుద్యోగం చేస్తే చట్టం అందరికి ఒక్కటే అంటూ నెటిజన్లు కామెట్స్ చేస్తున్నారు,ఏదైనా ఒక విషయం ఉంటే దానిని ధైర్యం గ ఎదుర్కోలేక తమ సామాజిక వర్గానికి జోగి రమేష్ అంటగట్టడం పరిపాటిగా మారింది ,అందులోను తాను చేసిన ,థ్యన కుమారుడు చేసిన తప్పులను కూడా తమ సామజిక వర్గాన్ని ఎవరో బలి చేస్తున్నారు అనే విధంగా ప్రవర్తిస్తుంటారు మాజీ మంత్రి వర్యులు అందుకే మొన్న తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు,అందరు తన లగే ,తన జగనన్న లాగే ఉంటారని కూటమి మంత్రులని మీ పదవుల కోసం తన కుమారుడిపై కామెంట్స్ చేయొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ముఖ్యమంత్రి, అనగాని సత్యప్రసాద్, పవన్ కల్యాణ్ వద్ద దీనిపై చర్చకు సిద్ధమన్నారు. తమపై కేసులు నమోదు చేయడం కంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయటంలో శ్రద్ధ చూపాలని కూటమి నేతల్ని జోగి రమేష్ కోరారు. కేవలం పరుష పదజాలం వాడితే గతంలో మాకు ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో అదే తరహాలో తీర్పు మీకు ఇస్తారంటూ శాపనార్ధాలు పెట్టారు . ప్రజలకు అన్ని తెలుసు, అన్ని గమనిస్తున్నారు. తమకు న్యాయం న్యాయస్థానాలో జరుగుతుంది అనే నమ్మకం బలంగా ఉందన్నారు. తనను మళ్ళీ పోలీసులు రమ్మనలేదని, పోలీసులకు పూర్తిగా సహాకరించాని తెలిపారు,ఇది కేవలం కర్మ ఫలితమే ....తమరు అధికారం లో ఉన్నప్పుడు మిడిపాటుకు చక్కని ఫలితమే ఇది అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు
Comments
0 comment