చంద్రబాబు ని కలవనున్న జూనియర్ ఎన్టీఆర్
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల జరుగుతున్న బీభత్సం చూస్తూనే ఉన్నాం. అనేక ప్రాంతాలు వరద ఉధ్ధృతి వల్ల తీవ్రంగా నష్టపోయాయి. ప్రభుత్వం, అధికారులు బాధితులను ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. మరోవైపు సినీ పరిశ్రమ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ఎప్పటిలాగే ముందుకు వస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు"వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా రూ. 50 లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నాను" అని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.అంతేకాదు, త్వరలోనే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఎన్టీఆర్ స్వయంగా చెక్ లను అందించనున్నాడట. ముఖ్యంగా తన మామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు ని ఎన్టీఆర్ కలవనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. ఈ కలయికతో నందమూరి అభిమానులు, తెలుగుదేశం శ్రేణుల ఆనందానికి అవధులు ఉండవు అనడంలో సందేహం లేదు
Comments
0 comment