చంద్రబాబు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఓర్పు తనను నిరంతరం ఆశ్చర్యానికి లోనుచేస్తూ వుంటుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని పవన్ కళ్యాణ్ వివరిస్తూ, "చంద్రబాబు ఓపిక చాలాసార్లు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. పాతికేళ్ల కుర్రాడు కూడా చంద్రబాబులా శ్రమించలేడు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే.. జగన్ పార్టీ విమర్శలు చేస్తోంది. వంద రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం. పెన్షన్లు పెంచడానికి ఖజానాలో డబ్బులు లేవు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచాం. సంక్షేమం విషయంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావు. నిస్తేజంగా వున్న పంచాయతీలకు ముఖ్యమంత్రి గారు 1,452 కోట్ల రూపాయలు ఇచ్చారు. వైసీపీ సర్పంచులు వున్న పంచాయతీలకు కూడా నిధులు ఇస్తాం. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. ఇంత ఉపయోగకరమైన అన్న క్యాంటీన్లను మూసేయాలని వైసీపీ ప్రభుత్వానికి ఎలా అనిపించిందో అర్థం కాని విషయం. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎం గారికి కృతజ్ఞతలు" అన్నారు.
Comments
0 comment