చంద్రబాబు విజనరీ,అమరావతికి క్యు కడుతున్న వివిధ పరిశ్రమ అధినేతలు

చంద్రబాబు విజనరీ ఎవరికీ తెలియని విషయం కాదు ,అతను చేసిన ముందు చూపు పనికి ఇప్పుడు అమరావతికి అధికారులు లైన్ కట్టారు అసలు తన ఐదేళ్ల పాలనా కాలంలో జగన్ రాజధాని నిర్మాణం  జరిగితే.. తద్వారా రాష్ట్రప్రగతి, ఆదాయం ఏ స్థాయిలో ఉంటాయో కనీసం ఊహించను కూడా ఊహించలేకపోయారు.  ఇప్పుడు ఐదేళ్లు జగన్ సర్వవిధాలా భ్రష్టుపట్టించిన లేదు లేదు భ్రష్టుపట్టించానని భ్రమపడిన అమరావతి ఇప్పుడు అభివృద్ధికి ఆలంబనగా నిలుస్తోంది. జగన్ రాక్షస పాలనలో ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేయడానికి వెనకడుగు వేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, జాతీయ బ్యాంకులు, సేవాట్రస్తులు, స్టార్ హోటళ్లు, ప్రైవేటు సంస్థలు ఇప్పుడు అమరావతి కేంద్రంగా పని చేస్తామంటూ ముందుకు వస్తున్నాయి. 

చంద్రబాబు తన హయాంలోనే  అంటే 2014-19 మధ్య కాలంలో పలు సంస్థలకు అంటే దాదాపు 60కి పైగా సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు చేశారు.  ఇప్పుడు నాడు భూమి కేటాయించిన సంస్థలతో చంద్రబాబు ఆదేశాల మేరకు సీఆర్డీయే అధికారులు సంప్రదింపులు మొదలెట్టారు.  ఆయా సంస్థల అధికారులను రాష్ట్రానికి రావలసిందిగా ఆహ్వానిస్తూనే, ఆయా సంస్థల కార్యకలాపాలు నిర్విఘ్నంగా ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు, అవాంతరాలు లేకుండా సాగించుకునే వాతావరణాన్ని  కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.  

అభివృద్ధి దార్శనికుడిగా చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరు, గుడ్ విల్ కారణంగా నాడు భూ కేటాయింపులు పొందిన సంస్థలన్నీ అమరావతిలో తమ సంస్థల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తమకు కేటాయించిన భూములను చూసి ప్రతిపాదనలు తెలియజేస్తామని సానుకూలంగా స్పందిస్తున్నాయని అధికారవర్గగాల ద్వారా తెలిస్తోంది.