హరీష్ రావు హైడ్రాను అందుకు వ్యతిరేకించాడా ?

హైడ్రాపై బీఆర్ఎస్ అనూహ్యంగా అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవడానికి కారణం ఏంటి? మొదట్లో హైడ్రాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన బీఆర్ఎస్… ప్రస్తుత పరిణామాలతో హైడ్రాపై యుద్ధం ప్రారంభించడానికి గల రీజన్ ఏమై ఉంటుంది? హైడ్రాతో పేదలు రోడ్డున పడుతున్నారనే బీఆర్ఎస్ ఆందోళనా? లేక కీలక నేతల సొంత ప్రయోజనాల కోసం ఆందోళనకు సిద్దం అవుతున్నారా? అనే అంశాలపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది.హైడ్రా విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై ఓ వైపు చర్చ జరుగుతుండగా…ఈ విషయంలో బీఆర్ఎస్ చేస్తోన్న రచ్చపై కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు ఆనంద్ కన్వెషన్ లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. హిమాయత్ సాగర్ ఎఫ్ టీ ఎల్ భూముల్లో అక్రమంగా ఆనంద్ కన్వెషన్ ను నిర్మించారని, అందులో హరీష్ రావుకు వాటాలు ఉన్నాయన్నారు.ఈ అక్రమ ఆస్తులను కాపాడుకునేందు కోసమే హరీష్ హైడ్రా విషయంలో రాద్దాంతం చేస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. తన ఆస్తుల రక్షణ కోసం అమాయక పేద ప్రజలను రోడ్డుమీదకు లాగుతున్నారని విమర్శించారు. హైడ్రా విషయంలో బీఆర్ఎస్ చేస్తోన్న ఉద్యమం ఓ బోగస్ అంటూ కొట్టిపారేశారు.హిమాయత్ సాగర్ జలాశయంలోని నిర్మాణాలను కూల్చివేసే పనిలో హైడ్రా బిజీగా ఉండటంతో హరీష్ రావు ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.