కార్తీక పౌర్ణమి ఎప్పుడు,ఏ రోజు జరుపుకోవాలి తెలుసా ?

ఈ సంవత్సరం ప్రతి పండుగా తగులు మిగులు వచ్చింది ,అలాగే ఇప్పుడు కార్తీక మాసం ,సాధారణంగా శివుడు, విష్ణువు లకు వేర్వేరు ప్రత్యేక రోజుల్లో పూజలు నిర్వహిస్తుంటారు. కానీ శివకేశులిద్దరికీ ప్రీతికరమైన మాసం.. ఆ ఇద్దరు స్వామివారలను ప్రత్యేకంగా పూజించే నెలనే కార్తీక మాసం. కార్తీక మాసం పూజలు, నోములు, వ్రతాలకు ప్రత్యేకం. ఈనెలలో ఉపవాసాలు ఉంటూ నోముల పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప మాలలు ధరిస్తారు. దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. 2023 ఏడాది కార్తీక మాసం నవంబర్ 14 నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది.అయితే కార్తీక పౌర్ణమిని ఎప్పుడు జరుపుకోవాలి? అనే సందేహం చాలా మందిలో ఉంది.శివుడికి ప్రీతికరమైన నెలనే కార్తీక మాసం. ఈ నెలలో శివాలయాలు మారుమోగుతాయి. భక్తితో శివనామస్మరణ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంలోకి రావడం వల్ల కార్తీక పౌర్ణమి ఏర్పడుతుంది. సాధారణ పౌర్ణమి కంటే కార్తీక పౌర్ణమి ప్రత్యేకమైనది. అందుకే ఈరోజు నదీస్నానం కూడా చేయడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.

2023 ఏడాదిలో పండుగల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గ్రహాల్లో కొన్ని మార్పుల వల్ల క్యాలెండర్ లో సూచించిన విధంగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి గురించి చాలా మంది సందేహం ఏర్పడింది. దీంతో కార్తీ పౌర్ణమిని ఎప్పుడు నిర్వహించుకోవాలి? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో కొందరు పండితులు క్లారిటీ ఇచ్చారు.

ఈ ఏడాది నవంబర్ 27నే కార్తీక పౌర్ణమి ఉందని పండితులు చెబుతున్నారు. ఆరోజున అత్యంత నియమ నిష్టలతో శివ పూజ చేయాలని చెబుతున్నారు. దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుందని అంటున్నారు. ఇదే నెలలో విష్ణ ఆరాధన కూడా జరుగుతుంది. శివకేశవుల పుత్రుడైన అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో భగవన్మాసరణతో మారుమోగనున్నాయి.