కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం

మాజీ మంత్రి   కెటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వహాయంలో ఫార్ములా ఈ రేస్ కుంభకోణం జరిగిందని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. ఐఎఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం 55  కోట్ల నిధులను కెటీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకే  నిర్వహణ సంస్థకు బదిలీ చేసి నట్లు  చెప్పారు.  అవినీతి నిరోధక చట్టం 17 ఏ క్రింద కెటిఆర్ ను అరెస్ట్ చేయనుందని తెలుస్తోంది. గతంతో ఎపిలో ఇదే చట్టం క్రింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసింది. నిధుల దుర్వినియోగం జరిగితే కెటీఆర్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశముంది.  ఏడు సంవత్సరాలు చట్ట సభలకు పోటీ చేసే అవకాశం ఉండదు. గవర్నర్ అనుమతి తీసుకుని ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇదే యాక్ట్ క్రింద అరెస్ట్ చేస్తే మూడు నెలల వరకు బెయిల్ రాకపోవచ్చు. తన ఆదేశం మేరకే అరవింద్ నిధులు బదిలీ చేశారని కెటీఆర్ సైతం అంగీకరించడంతో అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. మంత్రి పొంగులేటి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కెటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనాప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు తెలిపారు. కెటీఆర్ అరెస్ట్ తో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించింది.  నిధుల దుర్వినియోగం కేసులో ఎసిబి ఫైల్ సిద్దం చేసింది.  ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందని బిఆర్ఎస్ అంటోంది. కెటీఆర్ బావమరిదికి లాభం చేకూరేలా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారని కాంగ్రెస్ ఆరోపించింది.