కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్

ఎట్టకేలకు జానీ మాస్టర్ని పోలీసులు బెంగుళూరు లో అరెస్ట్ చేశారు ,కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు లేడీ కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. ఇక సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై పోక్సో కేసు సైతం నమోదైంది. అరెస్ట్ చేస్తారని తెలిసి, గత మూడు రోజులుగా జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. మొదట అతడు నెల్లూరులో ఉన్నాడని సమాచారం అందింది. అనంతరం లడఖ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టాయి.