కస్టడీలో వర్ర బయటపెట్టిన సంచలన విషయాలు
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడే వారిని అరెస్టు కూడా చేశారు. ఈ క్రమంలోనే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.ఈయన వైసీపీ కీలక నేత కుటుంబానికి సహాయకుడు కూడా. వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతుంటారు. గత ఐదేళ్లుగా ఇదే మాదిరిగా వ్యవహరించారు. కానీ అధికారం అండదండలతో ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వర్ర రవీందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయేవారు.అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం,ఆవేదనతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది.రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తునకేసులు నమోదు కావడం ప్రారంభం అయ్యాయి. అయితే 41 ఏ నోటీసులు ఇచ్చి వర్ర రవీందర్ రెడ్డిని వదిలేసారు కడప పోలీసులు. దీనిపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయ్యింది.అందుకు కడప జిల్లా ఎస్పీ మూల్యం చెల్లించుకున్నారు.ఆయనపై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డి ఆచూకీ కోసం నాలుగు పోలీసు బృందాలు విచారణను ప్రారంభించాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో రవీందర్ రెడ్డి పట్టుబడ్డారు. ఈ తరుణంలో ఆయనను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు.తన వెనుక ఉన్నది కడప ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు. మరోవైపు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు జీతాలు అందినట్లు కూడా వెల్లడించారు. ఇది ఒక సంచలన అంశంగా మారిపోయింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు బుర్ర రవీందర్ రెడ్డి.
Comments
0 comment