లోకేష్ ఓపెన్ చేస్తున్న రెడ్ బుక్

మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమలు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ కొంత కాలంగా రెడ్ బుక్ గురించి చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో భూములు దోచేసిన వారిని వదిలి పెట్టాలా అని ప్రవ్నించారు. రెడ్ బుక్ లో తప్పులు చేసిన వారి పేర్లు ఉన్నాయని..వారికి శిక్ష పడేలా చేయటం ఖాయమని స్పష్టం చేసారు. అన్నాక్యాంటీన్లకు డబ్బులు లేవని చెప్పిన వైసీపీ..సర్వే రాళ్ల కోసం భారీ గా ఖర్చు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రెడ్ బుక్ అమలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని వదిలేది లేదని ప్రచారంలో చెప్పానని లోకేష్ గుర్తు చేసారు.రెడ్ బుక్ విషయంలో ఊరూరూ వెళ్లి మాట్లాడనని వివరించారు. దీనిపై ప్రజలకు తాను హామీ ఇచ్చానన్నా రు. దానికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు మాకు మంచి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన కొన్ని అంశాలపై యాక్షన్ తప్పదన్నారు. ముఖ్యంగా లిక్కర్, ఇసుక దందాలు కొనసాగాయని చెప్పుకొచ్చారు. వారిని వదిలేది లేదు మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి కీలక విషయాలు వెల్లడించారు మంత్రి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని, ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి.. ఆయా భూములను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వాటిని అమ్మేశాడన్నారు. ఇలాంటి వాటిపై యాక్షన్ తీసుకోకూడదా అని ప్రశ్నించారు. ఇంకా లిక్కర్, ఇసుక దందాలపై చర్యలు తప్పవంటూ లోకేష్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారన్నారు. పేద ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని తెలిపారు. కేసుల్లో ఉన్న నేతలు మంగళగిరి నియోజవర్గం చేనేత వర్గాలకు జీఎస్టీ తొలగింపుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా సమయంలోనూ రెడ్ బుక్ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రస్తుతం జోగి రమేష్ భూముల కేసులో అరెస్ట్ అయ్యారు. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో జోగి రమేష్ విచారణ కు హాజరు కానున్నారు. ఇదే కేసులో మరి కొందరు వైసీపీ నేతలు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. ఇక, కొడాలి నాని..వల్లభనేని వంశీ పైన కేసులు ఉన్నాయి. దీంతో..రాజకీయంగా రానున్న రోజుల్లో చోటు చేసుకొనే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.