మెగా కుటుంభం లో భగ్గుమన్న విభేదాలు

మెగా స్టార్ చిరంజీవి కుటుంబంలో సభ్యులంతా ఒకటైతే, అల్లు అర్జున్ మాత్రం ప్రత్యేక ప్యాకేజీ పెట్టుకొని స్వతంత్రంగా జీవిస్తున్నారు. చిరంజీవి అనే వృక్షం కింద కాకుండా అల్లు అర్జున్ గా తనకంటూ ఓ సొంత బ్రాండ్ ఉండాలనేది అతని ఉద్దేశం. ఈ క్రమంలో సహజంగానే కొన్ని విభేదాలు తలెత్తుతుంటాయి. కొందరు వాటిని పొగరు అంటారు.. మరికొందరు అహంకారం అంటారు. ఎవరివైపు పరిశీలించినా, ఎవరు చెప్పేది విన్నా వారు చెప్పేదే సరైనది అని అనిపిస్తుంటుంది. ఇందులో ఎవరి వాదన వారిది. ఇటువంటి పరిణామాల మధ్య తలెత్తిన్న చిన్న చిన్న అనుమానాలు, అహంకారాలు చివరకు తీవ్రమైన విభేదాలకు దారితీశాయి. భగ్గుమన్న విభేదాలు? పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చేందుకు మెగా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండి అతని విజయం కోసం కృషిచేశారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ తో సరిపెట్టి.. నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న శిల్పా కిషోర్ రెడ్డికి మద్దతిచ్చేందుకు స్వయంగా వెళ్లారు. ఒక్కసారిగా మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మరో ట్వీట్ తో సరిపెట్టారు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లలేదు. ఆహ్వానం అందివుండదని కొందరంటున్నారు.మెగా కుటుంబంలోని సభ్యురాలైన నాగబాబు కుమార్తె నిహారిక కమిటీ కుర్రాళ్లు సినిమా నిర్మించారు. దీనికి మద్దతుగా మహేష్ బాబు, నాని లాంటి హీరోలంతా ట్వీట్ చేసి మద్దతు తెలిపారు. అల్లు అర్జున్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. అసలు ఈ సినిమా గురించే ఆయన పట్టించుకోలేదని చెప్పొచ్చు. తాజాగా బన్నీ వాసు నిర్మించిన ఆయ్ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను ఆదరించాలంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్ తో అల్లు అర్జున్ కావాలనే మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడనేది స్పష్టమైంది. పుష్ప2 డిసెంబరు ఆరున విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫ్లాప్ అయితే బన్నీ పొగరు, అహంకారం అన్నీ తగ్గుతాయని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి ఎవరో తనకు తెలియదని అంటాడని, భవిష్యత్తులో ఈ తరహా పరిణామాలే చోటుచేసుకోబోతున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.