నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే
వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన మహిళా నేతలపై ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోయి అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి కటకటాల్లోకి పంపిస్తున్నది. నాడు తమకు అడ్డెవరూ అన్నట్లు ప్రవర్తించిన వారిపై నేడు ఉక్కుపాదం మోపుతున్నది. మహిళలను అసభ్యంగా వేధించినవారిని, ప్రభుత్వంపై దుష్ర్పచారం చేసిన వారిని వదిలిపెట్టబోమని ఇటీవలే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.అవసరమైతే తానే హోంశాఖ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందో తెలియజెప్పుతున్నది. హోం శాఖ మంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నది. క్రైం కంట్రోల్ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక లేడీ హోం మినిస్టర్ ఇలా పని చేయడం ఇదే మొదటిసారి అంటూ సర్వత్రా అభిప్రాయం వినిపిస్తున్నది.
Comments
0 comment