పిన్నెల్లి పాపాల పుట్ట ?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన దగ్గర్నుంచి ఆయన చేసిన హత్యలు, అన్ని వర్గాల వారి మీద చేసిన దాడులు, కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు... వీటన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. పిన్నెల్లి బాహాటంగా చేసిన ఘోరాలలో కొన్నిటిని మాత్రమే ఈ పుస్తకంలో పబ్లిష్ చేశారు. లెక్కలకి అందని ఎన్నో ఘోరాలు ఈ పుస్తకంలో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఆర్థిక విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఆయన చేసిన అవినీతి విలువ రెండు వేల కోట్లకు పైగా అనే విషయం బుర్ర పేలిపోయేలా చేస్తుంది.
పిన్నెల్లి చేసిన నేరాలను చాప్టర్లవారీగా విభజించారు. వాటిలో 1. గ్రానైట్ అండ్ గ్రావెల్ దోపిడీ - రూ. 1,433 కోట్లు, పిఆర్కే టాక్స్, మద్యం దోపిడీ - రూ. 4 వందల కోట్లు, భూ కబ్జాలు - 376 ఎకరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భూముల కబ్జా, ఇతరుల ఆస్తుల కబ్జాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై పిన్నెల్లి దాడులు, అక్రమ కేసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ముఠా చేసిన హత్యలు, పిన్నెల్లి పైశాచికం, పిన్నెల్లి నేర వారసత్వం.. ఇలాంటి సబ్ హెడ్డింగ్స్ కింద పిన్నెల్లి చేసిన దారుణాలన్నీ వివరంగా ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆధారాలు, పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చారు.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, మంచి పరిపాలన వుండాలని కోరుకునేవాళ్ళందరూ ఈ పుస్తకం తప్పక చదవాలి. అయితే పిల్లలు, వృద్ధులు, సున్నిత హృదయులు, హార్ట్ పేషెంట్లు ఈ పుస్తకానికి దూరంగా వుంటే మంచింది. ఎందుకంటే, ఈ పుస్తకంలో వున్న ఘోరాలు చదివి వాళ్ళకు ఏమైనా అయ్యే ప్రమాదం వుంది మరి!
Comments
0 comment