పవన్ ఢిల్లీ టూర్ సక్సస్

ఏపీలో రాజ్యసభ పదవుల సందడి ప్రారంభమైంది. ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే మూడు రాజ్యసభ పదవులు కూటమికే దక్కనున్నాయి.దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి రెండు ఎంపీ పదవులు, బిజెపికి ఒకటి కేటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. తొలుత జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బిజెపి పెద్దలు ఓ కేంద్రమంత్రి కి ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని ఆలోచన చేశారు.చంద్రబాబుకు విన్నపం చేశారు. అందుకే ఈ సారికి జనసేనకు చాన్స్ లేదని తెలుస్తోంది. అయితే పవన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో నాగబాబు విషయంలో కేంద్ర పెద్దలతో చర్చిస్తున్నట్లు సమాచారం.ముందుగా రాజ్యసభకు నాగబాబును పంపించి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నది పవన్ ఉద్దేశం.ఈ తరుణంలో ఢిల్లీలో ఉన్న పవన్ కేంద్ర పెద్దలతో చేస్తున్న చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది.ఢిల్లి పెద్దలు  కోరికతోఅయితే ఒక ఎంపీ పదవిని జనసేనకు కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. చంద్రబాబు కూడా అంగీకరించినట్లు టాక్ నడిచింది. నాగబాబు పేరు ప్రకటన తరువాయి అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ అనూహ్యంగా కేంద్ర పెద్దలు ఒక పదవి అడిగేసరికి సమీకరణలు మారాయి. దీంతో ఢిల్లీలో ఉన్న పవన్ కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. నాగబాబు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ తో పాటు నాగబాబుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నది పవన్ ఉద్దేశం. ఇప్పటివరకు జనసేన కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు. ఆ పార్టీకి ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు. నాగబాబు రాజ్యసభకు ఎంపిక అయితే జనసేన ఎంపీల బలం మూడుకు చేరనుంది. కేంద్రమంత్రిగా నాగబాబు పదవి చేపడితే.. కొణిదల కుటుంబంలో అందరూ మంత్రి పదవులు చేపట్టినట్లు అవుతుంది.