పవన్ గెలుపు వెనుక ఇంకొక మనిషి వున్నాడు
సీతారామం, మహానటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా మారిన దుల్కర్ సల్మాన్ ఈ నెల 31 న 'లక్కీ భాస్కర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సితార ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా హిట్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరిదర్శకుడుగా వ్యవహరిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ప్రముఖ హీరో విజయ్ దేవర కొండ తో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ మూవీలో ఒక కీలక పాత్రలో చేస్తున్న జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదిమాల్లోకి వచ్చాను.రచన గురించి వర్ణించాలంటే త్రివిక్రమ్ గారికి ముందు, త్రివిక్రమ్ గారి తర్వాత అని వర్ణించవచ్చు.ఆయన సినిమాల్లోని డైలాగులు చాలా మంది జీవితాల్లో మార్పులు తెచ్చాయి. ఆయనంత గొప్పగా డైలాగులు రాయాలంటే అవతల కూడా త్రివిక్రమ్ అయ్యి ఉండాలి.ఎన్టీఆర్గారు చెప్పినట్టు త్రివిక్రమ్ గారు చాలా అరుదైన వ్యక్తి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అంతకు మించి వేరే అప్షన్ లేదు. రామాయణ, భారత, భాగవత ల మీద పట్టు ఉన్న త్రివిక్రమ్ గారికి ఒక సినిమా ఎలా తెరకెక్కించాలో మరొకరు చెప్పాల్సిన పని లేదు.పవన్ కళ్యాణ్అన్ని కష్టాలని దాటుకొని కొన్ని లక్షల మంది అభిమానుల సపోర్ట్ తో ఎలా అయితే ఎన్నికల్లో గెలిచారో ఒక ఫ్రెండ్ గా ఆయన విజయంలో త్రివిక్రమ్ గారి సపోర్ట్ కూడా అంతే ఉందని చెప్పుకొచ్చాడు.
Comments
0 comment