రామనామ సంకీర్తన తో మారుమ్రోగిన చేబ్రోలు గ్రామం

కొన్ని కోట్ల భారతీయుల కల అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 16వ తేదీ నుంచి రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే గురువారం రోజున బాలరాముడిని గర్భగుడిలోకి తీసుకువచ్చారు. ఈనెల 22వ తేదీన(అనగా రేపు ) మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం యావత్ భారతావని ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అందులో భాగంగా కాకినాడ జిల్లా ,గొల్లప్రోలు మండలం,

1056-entry-1-1705822403.jpg

చేబ్రోలు గ్రామం లో అద్భుతమైన గ్రామ  రామనామ సంకీర్తన కార్యక్రమం జరిగింది ,ఈ కార్యక్రమం లో  ఐదు వేలమంది రామభక్తులు రామనామ సంకీర్తన చేస్తూ, గ్రామం మొత్తం రామ నామ మయం చేశారు,ఈ గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో భక్తుల సౌకర్యార్ధం ప్రసాద వితరణ ,మరియు మంచి నీటి వసతులని గ్రామస్థులు ఏర్పాటు చేశారు ,ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం లో చిన్న పెద్ద తేడాలేకుండా రామనామ సంకీర్తన తో చేబ్రోలు గ్రామం మునిగి తేలింది,ఈ కార్యక్రమము చేబ్రోలు రాముల వారి ఆలయం దగ్గరనుండి మొదలుకుని ,గ్రామము మొత్తం రామభక్తులు  రామనామ సంకీర్తన చేస్తూ వూరు వాడల రామనామం   తో మారుమ్రోగిపోయింది   

 

న్యూస్ కోఆర్డినేటర్ 

ముమ్మిడి మురళి మోహన్