రాంగోపాల్వర్మకు హైకోర్టులో చుక్కెదురు ? అరెస్ట్ కు సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంటే జగన్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కోసం రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అదే విధంగా ఆయన తీసిన వ్యూహం సినిమాలో కూడా వీరిని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి.వీటిపైనే ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు రామలింగం ఫిర్యాదు మేరకు కూసు నమోదైంది. విచారణకు హాజరు కావాలంటూ ఏపీ పోలీసులు హైదరాబద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారు. ఆ నోటీసుల ప్రకారం రామ్ గోపాల్ వర్మ మంగళవారం (నవంబర్ 19) పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ తనపై నమోదైన కేసు కొట్టివేయాలనీ, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలనీ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  రామ్ గోపాల్ వర్మ పిటిషన్ సోమవారం (నవంబర్ 18) విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేస్తూ..  అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అంతే కాకుండా పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం (నవంబర్ 19)న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.