వైసీపీ మాజీ మంత్రి కొడుకు అరెస్ట్
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను పోలీసులు తమిళనాడులోని మధురైలో అరెస్టు చేశారు.మధురై ఆలయం సందర్శించి తిరిగి వస్తుండగా ఆయన్ను పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసారు. కోనసీమ జిల్లాలో దళిత యువకుల అరెస్టు కేసులో శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై మాజీ మంత్రి విశ్వరూప్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల అరెస్టు వెనుక ఏముందో చెప్పేశారు.కావాలనే పోలీసులు తన కుమారుడిని ఈ కేసులో ఇరికించారని మాజీ మంత్రి విశ్వరూప్ తెలిపారు. హత్యకేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మరణించిన వ్యక్తి తమ మనుషుల్లో ఒకడని, పోలీసుల విచారణలో, ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా తన కుమారుడి పేరు లేదన్నారు. అయినా రాజకీయ కక్షతో నిందితులతో తన కొడుకు పేరు చెప్పించి తప్పుడు కేసు పెట్టారని విశ్వరూప్ ఆరోపించారు.టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని పినిపె విశ్వరూప్ ఆరోపించారు. కోనసీమలో కక్ష రాజకీయాలకు ఆజ్యం పోస్తోందని విమర్శించారు. చనిపోయిన వ్యక్తి తమ పార్టీ కార్యకర్తల్లో ఒకరని, అయినా తన కుమారుడిపై కక్షసాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. మధురై ఆలయ సందర్శనకు వెళ్లివస్తున్న సమయంలో తన కుమారుడిని అరెస్టుచేశారని ఆయన వెల్లడించారు.
Comments
0 comment