వైసీపీ సోషల్ మీడియా పేకప్

ఆంధ్రలో  అన్ని రాజకీయ పక్షాలకు సోషల్ మీడియా వింగులు ఉన్నాయి. పార్టీల అనుబంధ విభాగాల కంటే.. సోషల్ మీడియా విభాగాలే పవర్ఫుల్. ప్రధానంగా వైసిపి సోషల్ మీడియా అయితే గత ఐదేళ్లుగా ఒక ఊపు ఊపేసింది. విజయ్ సాయి రెడ్డి దగ్గర ఉన్న సోషల్ మీడియాను సజ్జల కుమారుడు భార్గవ రెడ్డికి అప్పగించారు జగన్. గతకొద్దిరోజులుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ పెరిగాయి. అందులో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. అటు ఐప్యాక్ టీం సైతం సేవలందిస్తూ వస్తోంది. కానీ పోలింగ్ సరళితో వైసిపి సోషల్ మీడియా దుకాణం బంద్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఐ ప్యాక్ టీం సభ్యులను సైతం సెలవులు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఐ ప్యాక్ ద్వారా విచ్చలవిడిగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ ను కొనుగోలు చేశారు. దీనికి గాను 50 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అయితేమారిన పరిస్థితుల్లో అంత మొత్తం ఇచ్చేందుకు జగన్ నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు భారతి కలుగజేసుకొని సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత రోజే ఐప్యాక్ సిబ్బందిని మెడపట్టి బయటకు గెంటేశారు. రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఉన్న ఐ ప్యాక్ సేవలు ఇక చాలని చెప్పేసినట్లు సమాచారం. దీంతో ఆ రెండు విభాగాల్లో పని చేస్తున్న వందలాది మంది వీధిన పడ్డారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా టీం ను కూడా సాగనంపడం హాట్ టాపిక్ గా మారింది. ఆ విభాగంలో 150 మంది వరకు పనిచేస్తుంటారు. వీరందరికీ ఆర్గనైజర్ సజ్జల భార్గవరెడ్డి. అయితే నేరుగా తీసేసామని చెప్పకుండా.. ఎన్నికల ఫలితాల వరకు సెలవు ఇచ్చామని మాత్రమే చెప్పారు. ఎంతో ఈ నెల జీతాలు ఇస్తారా లేదా అన్న టెన్షన్ వారిలో ఉంది.వైసీపీకి సేవలందిస్తున్న సోషల్ మీడియా విభాగానికి గత ఆరు నెలలుగా జీతాలు లేవు. ఒకానొక సమయంలో ఒకరిద్దరు యాక్టివిస్టులు రచ్చ చేశారు కూడా. మరోవైపు ఎన్నికలకు ముందే సోషల్ మీడియా విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డి పై కేసు కూడా నమోదయింది. గత ఐదేళ్లుగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. అందుకే సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన వారు సైతం భయపడుతున్నారు. ఈ నెల జీతాలు దొరికిన క్షణం నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి అయితే ఎన్నికల ఫలితాలు రాకమునుపే వైసిపి సోషల్ మీడియా దుకాణం బంద్ చేసింది.