విజయవాడ దుర్గమ్మహుండీ ఆదాయం
విజయవాడ దుర్గమ్మకు దసరా ఉ్సతవాల సమయంలో భారీగా ఆదాయం సమకూరింది. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఆలయంలోని మహామండపం ఆరో అంతస్తులో హుండీల లెక్కింపు జరిగింది. 15 రోజుల్లో హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దుర్గమ్మకు భక్తులు 272 గ్రాముల బంగారం, 9.325 గ్రాముల వెండి వస్తువులను మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. అలాగే కానునకల్లో విదేశీ కరెన్సీ కూడా ఉంది. 285 యూఎస్‌ఏ డాలర్లు, 160 ఆస్ట్రేలియా డాలర్లు , 50 కెనడా డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 సౌది రియాల్స్, 6 సింగపూర్ డాలర్లు,5 కువైట్ దీనార్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొంతమంది భక్తులు కానుకల్లో అమ్మవారికి సమర్పించేందుకు నోట్ల దండను కూడా మొక్కు రూపంలో చెల్లించుకున్నారు. ఆలయంలో హుండీల లెక్కింపును ఈవో రామరావు, డిప్యూటీ ఈవో రత్నంరాజు దగ్గరుండి పర్యవేక్షించారు.
Comments
0 comment