వర్ర రిమాండ్ లో అన్ని షాకింగ్ లే ....!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో అరెస్టు అయిన ఆ పార్టీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు రిమాండ్ కు పంపారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వర్రా ఇచ్చిన వాంగ్మూలంలోని పలు అంశాల్ని వారు వెల్లడించారు. ఇందులో చాలా సంచలన అంశాలు ఉన్నాయి. వైసీపీ హయాంలో తమ రాజకీయ ప్రత్యర్థులపై సాగించిన సోషల్ మీడియా ప్రచారంపై పోలీసులకు వర్రా రవీందర్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించాడు. ఇందులో ఐప్యాక్ టీం కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్లమని తెలిపాడు. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో ఈ కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లమని వెల్లడించాడు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టినట్లు అంగీకరించాడు.నాయకులు, వారి కుటుంబసభ్యులపై పోస్టులు పెట్టేవాళ్లమన్నాడు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్‌రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టినట్లు వర్రా తెలిపాడు. సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయినట్లు చెప్పుకొచ్చాడు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడని వర్రా పోలీసులకు వివరించాడు. 2023 నుంచి నా ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారన్నారు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామని తెలిపాడు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ పీఏ రాఘవరెడ్డి కంటెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్‌రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారన్నాడు. పవన్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టానని వెల్లడించాడు. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకమని వర్రా రవీందర్‌రెడ్డి తెలిపాడు.
Comments
0 comment