అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రం లో తెలుగు సాంస్కృతిక సంఘం కార్తీకమాస వనసమారాధన సందడి

కార్తికమాసం శివ కేశవులకి ఎంతో ప్రీతీ పాత్రమైన మాసం ,ఈ మాసం లో ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ,నది లో కార్తీక దీపాలని వదులుతూ ... హర హర మహాదేవ అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది,దేవదేవుడు ,మహాదేవుడు ,త్రయంబకుడు కరుణా కృపాకటాక్షములు తమపై ఉండాలని భక్తులందరూ శివ నామ స్మరణ చేస్తూ వుంటారు ,ఇదే మాసం లో వనభోజనానికి పురాణాలలో  చాలా ప్రాముఖ్యత ఉంది

ఇది ఒక భారతదేశం లోనే కాకుండా ఇతర దేశాలలో వున్నా ప్రవాస భారతీయులు కూడా ,మన భారతీయుల మూలాల్ని మరిచిపోకుండా ఎంతో భక్తి శ్రద్దలతో కార్తీక మాసాన్ని చేస్తూ శివుడిని పూజించడం ఎంతో సంతోషకరమైన విషయం  ,ఇందులో భాగంగా ఫ్లోరిడా రాష్ట్రం లో తెలుగు సాంస్కృతిక సంఘం  ప్రవాస భారతీయులు కూడా  వనభోజన ఏర్పాట్లు చేసి కార్తీక మాస వైభవాన్ని ఆస్వాదించారు 

అంతే కాకుండా పిల్లలకు భారతీయ మూలాలు ,వాటి యొక్క గొప్పతనాలని వివరించారు,మేము దేశాలు సరిహద్దులు దాటినా భారతీయ ఆధ్యాత్మిక సౌరభం మా నర నరా నా ఉంటుంది అని నిరూపించారు,ఈ కార్యక్రమంలో జేకే గ్రూప్స్ యు. ఎస్ .ఏ చైర్మన్ శ్రీ కోరపాటి కృష్ణారావు ,ప్రవాసభారతీయులు పాల్గొన్నారు