అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌ కి తీవ్ర అస్వస్థత ?

అమెరికా దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 

కానీ ఆయన ఎక్కడ చికిత్స తీసుకున్నారో, ఏమైపోయారో మాత్రం బయటకు రాలేదు.దీంతో అగ్రరాజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది.వాస్తవానికి అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడితో పాటు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పక్షంలో వెంటనే అధికారికంగా ప్రకటిస్తారు.అలాంటిది ఆస్టిన్ విషయంలో ఇలాంటి పరిణామాలు కనిపించకపోవడంతో పెంటగాన్ ప్రెస్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.దీనికి తోడు ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్యుద్ధం, తైవాన్‌పై చైనా దురాక్రమణకు ఎత్తులు, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు వంటి ఉద్రిక్తతలతో ప్రపంచ రాజకీయ వాతావరణం అస్తవ్యస్తంగా వుంది.ఇలాంటి పరిస్దితుల్లో ఆస్టిన్ ఆసుపత్రిలో చేరడం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో లాయిడ్ ఆస్టిన్ స్వయంగా స్పందించారు.చికిత్స విషయంలో నెలకొన్న గోప్యతకు పూర్తి బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.ఇందులో తన అనారోగ్యానికి సంబంధించిన కారణాలు, చికిత్స తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.లాయిడ్ గత సోమవారమే ఆసుపత్రిలో చేరినప్పటికీ.పెంటగాన్ ఇన్నిరోజులు ఎందుకు గోప్యంగా వుంచిందన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆస్టిన్ ఎప్పుడు కోలుకుంటారో, తిరిగి విధులకు ఎప్పుడు హాజరవుతారో తెలియాల్సి వుంది.

ఆ పరిణామాలపై ప్రపంచ దేశాలు కూడా ఓ కన్నేసి వుంచాయి