అమెరికా తెలుగు సంఘం నాట్స్ సేవాకార్యక్రమాలు

సేవ చేయడం లోను సేవా కార్యక్రమాలలోను ఎప్పుడు ముందుండే   ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనాధ చిన్నారుల కోసం ఫుడ్, అండ్ టాయ్స్ డోనేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఫ్లోరిడాలోని టంపాబేలో నాట్స్ విభాగం నిర్వహించిన ఈ డోనేషన్ డ్రైవ్‌లో సేకరించిన ఆహారాన్ని, బొమ్మలను  టంపాలోని ఫీడ్ అవర్ చిల్డ్రన్ హోమ్‌లోని అనాథ చిన్నారులకు విరాళంగా అందించింది. నాట్స్ సభ్యులు, తెలుగువారు చాలా మంది బొమ్మలను, ఆహారాన్ని విరాళంగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. నాట్స్ చేపట్టిన ఈ డోనేషన్ డ్రైవ్ పట్ల ఫీడ్అవర్ చిల్డ్రన్ సంస్థ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిందో అంతే కాదు  నాట్స్ సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమం చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. చిన్నారుల్లో సృజనాత్మకత పెంచే పజిల్స్, బొమ్మలు, రిమోట్ కార్లు, సాప్ట్ టాయ్స్ ఇలా ఎన్నో రకాల బొమ్మలు టాయ్ డ్రైవ్‌లో నాట్స్ సేకరించడం ఇవ్వడాన్ని ఫీడ్ అవర్ చిల్డ్రన్ సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే భావన పెంచడానికి ఈ డ్రైవ్ ఎంతగానో దోహద పడుతుందని ఫీడ్ అవర్ చిల్డ్రన్ సంస్థ అభిప్రాయపడింది.  పండుగ సమయంలో అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డోనేషన్ డ్రైవ్ చేపట్టిందని నాట్స్ తెలిపింది.  టంపా నాట్స్ విభాగం సభ్యులు, తెలుగు వారు కుటుంబసమేతంగా చిన్నారులతో సహా ఈ  ఈ డోనేషన్ డ్రైవ్‌లో పాల్గొని  విజయవంతం చేశారు. రామ కామిశెట్టి, రాజేష్ కాండ్రు, సురేష్ బొజ్జా, భాను ధూళిపాళ్ల, భాస్కర్ సోమంచి తదితరులు ఈ డోనేషన్ డ్రైవ్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.