భారతీయులు గర్వంగా చెప్పుకునే ప్రవాసభారతీయుల గీతా జయంతి ఉత్సవాలు

961-entry-0-1703384673.jpg

ప్రవాసభారతీయులు తెలుగు జాతి ఆధ్యాత్మిక సౌరభాలను ,మూలలను, ఖండాతరాలు కూడా ప్రచారం చేస్తున్నారు .ఇందులో భాగంగా ,పరమ పవిత్రమైన గీతా జయంతి సందర్భంగా ఫ్లోరిడా తెలుగు సాంస్కృతిక సంఘం -మనం లోక కల్యాణార్థం, శ్రీకృష్ణ అనుగ్రహం కోసం సంపూర్ణ భగవద్గీత పారాయణం మార్గశీర్ష శుద్ధ ఏకాదశి, డిసెంబర్ 22న నిర్వహించింది. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన ఈ FTCS మనం సభ్యులు ఈ ‘గీతోత్సవం’ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నారు. ఇది నాలుగవ సంవత్సరం. ముందుగా శ్రీకృష్ణాష్టకంతో కార్యక్రమాన్ని ప్రారంభించి, శ్రీకృష్ణ షోడశ ఉపచార పూజ తరువాత, భగవద్గీత ధ్యానం, భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు, భగవద్గీత మాహాత్మ్యం పారాయణ చేశారు. విష్ణు సహస్ర నామ, లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్ర పారాయణలతో, శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి, మంగళాశాసనములతో, చక్కటి భజనలతో జయప్రదంగా శ్రీకృష్ణ స్వామిని సంప్రదాయబద్ధంగా సేవించుకున్నారు. భక్తులు చక్కటి నివేదనలను భగవానుడికి సమర్పించుకున్నారు. 

961-entry-0-1703384607.jpg

గీతాజయంతి నాడు భగవద్గీత పారాయణము లేదా శ్రవణము చేసినవారికి లక్షగోవులను దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం(30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు కూడా పాల్గొనడం ముదావహం. ఇటువంటి ధార్మిక కార్యక్రమములు ఇంకా ఇంకా ప్రపంచమంతా జరగాలని, ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని ఫ్లోరిడా తెలుగు సాంస్కృతిక సంఘం-మనం సభ్యులు కోరుకుంటున్నారు.