భూకంపం తో జపాన్ అతలాకుతలం,శరణార్థులుగా ప్రజలు పునరావాసాల్లో .....

జపాన్ ఇషికావా ప్రిఫెక్చర్‌లో భూకంప నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందరో శరణార్థులుగా మిగిలారు ,జపాన్ వాయువ్య తీరంలోని ఈ ప్రాంతంలోనే భూకంప కేంద్రం ఉంది.సోమవారం భూకంపం వచ్చాక వేల మంది ప్రజల్ని తీర ప్రాంతం నుంచి అధికారులు సురక్షిత కేంద్రాలకు తరలించారు.ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి సైన్యం ఆహారం, నీరు, దుప్పట్లు అందిస్తోంది.జపాన్‌లోని నొటో ద్వీపకల్పంలో ప్రజలు ఆహారం, నీటి కోసం స్టోర్ల ముందు బారులు తీరారు. చాలా ప్రాంతాల్లో పెట్రోలు బంకుల దగ్గర కార్లు క్యూలలో కనిపిస్తున్నాయి.భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందించేందుకు రెస్క్యూ సిబ్బంది వేగంగా కదులుతున్నారు.

999-entry-0-1704186847.jpg

శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.కొన్ని ప్రాంతాలకు సహాయ బృందాలు చేరుకోవడం కష్టంగా మారిందని, అయినప్పటికీ ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి ఫుమియో కిషిడా తెలిపారు.భూకంప బాధితులకు అమెరికా అండగా ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.ప్రకంపనల నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని వేల మంది సోమవారం రాత్రి పునరావాస కేంద్రాల్లోనే ఉండిపోయారు.సోమవారం జారీచేసిన సునామీ ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం హెచ్చరిక స్థాయిని అడ్వైజరీ స్థాయికి తగ్గించారు.ప్రజలు భూకంపానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.