ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్ల దాడి ,తిప్పికొట్టినా దాయాదిదేశం
మూడవ ప్రపంచయుద్ధం ఎంతో దూరం లో లేదా ? త్వరలోనే అన్నిదేశాలూ యుద్దానికి పూనుకుంటాయా ? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలానే వుంది అంటున్నారు ప్రపంచ విశ్లేషకులు ,ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ డజన్లకొద్దీ డ్రోన్‌లను ప్రయోగించింది. అవి లక్ష్యాలను చేరుకోవడానికి గంటల సమయం పడుతుందని ఇరాన్ సైన్యం తెలిపింది. ఇదిలా ఉండగా డ్రోన్లను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ నుంచి ఇరాక్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌వైపు డజన్ల కొద్ది డ్రోన్‌లు ఎగురుతున్నట్లు ఇరాన్ స్థానిక మీడియాలో కథనం ప్రచురించింది. అయితే ఈ డ్రోన్లలో కొన్ని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ వాటి గగన తలాన్ని మూసివేశాయి. ఈ నేపథ్యంలో సిరియా, జోర్డాన్ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి.ఈనెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గగనతల దాడి చేసింది. ఈ దాడిలో ఐఆర్‌జీసీకి చెందిన సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని, ఆదేశాన్ని శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. అప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి,ఇదిలా ఉండగానే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయబోతుందని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే తాము ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని కూడా బైడెన్ స్పష్టం చేశారు. అన్నిరకాలుగా సాయం చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే బైడెన్ చెప్పినట్లుగా ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి మొదలు పెట్టింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Comments
0 comment