సౌత్ ఫ్లోరిడాలో అంబరాన్ని అంటిన "సంక్రాంతి సంబరాలు"
ఫ్లోరిడా లో నిన్న ప్రవాసభారతీయులు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి, అందులోను మన భారతీయులు ఎక్కడవున్నా తెలుగు సాంప్రదాయాలు ,వాటి యొక్క విలువలు విస్తరింపజేయడం లో అపారమైన కృషి చేస్తూనే వున్నారు అనడం లో అతిశయోక్తి లేదు, నిన్న ఫ్లోరిడా తెలుగు కల్చరల్
సొసైటీ (ఫ్లోరిడా తెలుగు సాంస్కృతిక సంఘం ) ఆద్వర్యం లో ఫండ్రైజ్ పార్కు లో సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరిగాయి
ఇందులో భాగంగా పిల్లలకు వివిధరకాల భారత ప్రాంతీయ ఆటలను పిల్లలతో పెద్దలతో ఆడించి వాలాకు బహుమతులను అందజేశారు , గొబ్బిళ్ళ దగ్గరనుండి బతుకమ్మ సంబరాలు వరకు,హరిదాసు దగ్గరనుండి ఎడ్ల పందాలవరకు భారతీయ సంప్రదాయాల విలువలను పిల్లలకు తెలియజేస్తూ వాటియొక్క ప్రభావం భారతీయులపై ఎలావుంటుందో చెప్పారు,
ఈ కార్యక్రామలలో పాటలపోటీలు ,ఆటలపోటీలు ను నిర్వహించారు ,ఇందులో పాల్గొన్న మహిళారాణులు అందరు తమతమ చేతి వంటలను రుచి చూపించి భారతదేశం లో వున్నా వారి వారి ప్రాంతాలను గుర్తు తెచ్చేవిధంగా విందు ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరు హుషారు గా పాల్గొని మన భారతదేశంలో వున్నా అనుభూతితో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి
Comments
0 comment