సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ.... భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఫ్లోరిడా ప్రవాసభారతీయులు.
తెలుగు వారి సంప్రదాయాలు సనాతన ధర్మాలు వేదప్రోక్తం ,ఎందుకంటే వేదం చెప్పినదే గురువులు చేస్తారు ,గురువులు చెప్పిందే మనము ఆచరిస్తాము ,మానపురాణాలు చెప్పిన విధంగా మనము పూజలు ,నోములు ఆచరిస్తాము ,అలాగే మన కోరికలను ఆపరమేశ్వరుడు ముందు వుంచుతాము ,ఖండాలు దాటినా మన వేదాచరణము ఎక్కడా తగ్గలేదు అని చెప్పడానికి నిదర్శనమే ప్రవాసభారతీయులు ఆచరిస్తున్న నోములు ,పూజలు . ఈ కార్తికా మాసం లో ఫ్లోరిడా రాష్ట్రం లో వున్నా మన తెలుగువారందరూ ఆ వేదాంత వైద్యుడిని ,పరమేశ్వరుడిని పూజించి ,చక్కని వనభోజనాలు ,పురాణ కాలక్షేపములతో గడిపారు ,వీరు భావితరాల పిల్లలకు మన తెలుగు సాంప్రదాయాలను గుర్తుచేస్తూ ,వారికి మార్గదర్శకులుగా నిలుస్తూ ఎందరో మన్నలను అందుకుంటున్నారు
Comments
0 comment