బి ఆర్ ఎస్ కు షాక్ ? పార్టీ మారుతున్న నాయకులు

తెలంగాణా ఎన్నికల్లో కారు అద్దాలు పగిలిపోతట్టు చేశారు అక్కడ ఓటర్లు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు షాకివ్వడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. దీంతో వారు పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా సోమవారం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్గొండ పార్లమెంటు స్థానం సన్నాహాక సమావేశానికి సుఖేందర్ రెడ్డి రాలేదు. ఇవాళ అమిత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని కలవడం చర్చనీయంశంగా మారింది.ఎంపీ టికెట్ కోసమే అమిత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిన కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే నల్గొండ టికెట్ జానా రెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డికి కేటాయించారు. దీంతో భువనగిరి నుంచి తనకు టికెట్ ఇవ్వాల్సిందిగా.. అమిత్ రెడ్డి కోరినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ భువనగిరి టికెట్ ను బీసీకి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి గుత్తు సుఖేందర్ రెడ్డి ఆ పార్టీకి అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు.ప్రస్తుతం గుత్తా కుటుంబం గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్‌కు జగదీష్ రెడ్డి అడ్డు తగులుతుండడంపై కూడా అమిత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఉత్తమమని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే నల్గొండలో ప్రస్తుతం కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ నిలదొక్కుకోవడం కష్టంగా ఉంది. అందుకే అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారాలని భావిస్తున్న గుత్తా కుటుంబం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రహస్యంగా కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమిత్ కుమార్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.