బీజేపీ ,వైసీపీ ఎంపీ లకు విందు ఇచ్చిన రేవంత్ ,కారణం అదే ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నిన్న  ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్‌సభ ఎన్నికలు తదితర అంశాలపై వారితో చర్చించారు. అనంతరం గత నాలుగున్నరేళ్లుగా పార్లమెంటులో తనతో కలిసి పనిచేసిన వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు రేవంత్‌ విందు ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గత రాత్రి ఈ విందును ఏర్పాటు చేశారు.విందులో టీడీపీ, వైఎస్సాఆర్‌సీపీ సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. టీడీపీ నుంచి గల్లా జయదేవ్‌, వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వేంరెడ్డి ప్రభాకరరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్‌రావు, వల్లభనేని బాలశౌరి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వంగా గీత, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్‌, ఆదాల ప్రభాకరరెడ్డి చింతా అనూరాధ, బీశెట్టి వెంకటసత్యవతితోపాటు రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాణికం ఠాగూర్‌, కార్తీ చిదంబరం, రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ, శశి థరూర్‌, గౌరవ్‌ గొగొయ్‌, దీపేందర్‌ హుడా, హిబి ఇడెన్‌, బీజేపీ నుంచి సీఎం రమేశ్‌ టీఎంసీకి చెందిన సౌగత్‌ రాయ్‌, ఎన్‌సీపీకి చెందిన ప్రఫుల్‌ పటేల్‌, డీఎంకేకు చెందిన కళానిధి, బీఎస్పీకి చెందిన డానిష్‌ అలీ, రితేశ్‌ పాండే తదితరలు ఈ విందులో పాల్గొ