బర్రెలక్క ఎన్ని ఓట్లు వచాయో తెలుసా?

తెలంగాణా ఎన్నికల్లో తన ఉనికిని చాటిన బర్రెలక్క ,ఈ ఎన్నికల్లో నేను వున్నాను అని కొన్ని ఓట్లు చేజిక్కించుకుంది  ఫలితాలు వచ్చి  బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠనెలకొంది. అయితే తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లో బర్రెలక్క ముందజంలో నిలిచారు. దీంతో నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు స్పష్టమైంది. అయితే ఈవీఎమ్‌లలో మాత్రం బర్రెలక్క వెనకపడింది.

పోస్టల్‌ బ్యాలెట్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కంటే ముందు వరుసలో నిలిచిన శిరీష ఈవీఎమ్‌ ఓట్లలో వెనుకంజ వేసింది. విజిల్‌ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన శిరీషకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు వచ్చాయి.

దీంతో శిరీషకు మొత్తం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జూపలి కృష్ణరావు 9,797 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో బర్రెలక్క వెయ్యి లోపు ఓట్లకు పరిమితం అయ్యింది