కెసిఆర్ కు ,మాజీలకు ,ఎమ్మెల్యే లకు భద్రత కుదింపు
రేవంత్ మార్క్ రాజకేయం మొదలైందా ?తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రతను కుదించింది. ఇప్పటి వరకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న కేసీఆర్ కు వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. వై కేటగిరీ భద్రత కింద కేసీఆర్ కు 4 ప్లస్ 4 గన్ మెన్లతో పాటు, ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్ కు సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. మాజీ మంత్రులుగా పని చేసి, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2 ప్లస్ 2 భద్రతను కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల ఛైర్మన్లకు భద్రతను పూర్తిగా తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగో ప్రముఖుల సెక్యూరిటీపై కూడా సమీక్ష జరిగింది. మాజీలలో ఎవరికైనా భద్రత అవసరమైన వారికి, ఏజెన్సీ ఏరియాలో ఉన్న వారికి గన్ మెన్లను ఇచ్చే అవకాశం పరిశీలనలో ఉంది. అయితే, వీరికి సంబంధించి పూర్తిగా రివ్యూ చేసిన తర్వాతే గన్ మెన్లను ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్‌మన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది. ఎవరికి గన్‌మన్లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై దృష్టి సారించింది.
Comments
0 comment