మాజీ సీఎం కెసిఆర్ పై కేసు
తెలంగాణా ఎన్నికల తరువాత కూడా రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ హై కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోకాపేటలో పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 11 ఎకరాల భూ కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం (జనవరి 25) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. కోకాపేటలో (సర్వే నెం. 239, 240) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా, అప్పటి ప్రధాన కార్యదర్శి, అప్పటి రెవెన్యూ సెక్రటరీ, బాధ్యులైన మరికొద్దిమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చింది.
Comments
0 comment