మిషన్ భగీరథ పై విచారణకు ఆదేశించిన రేవంత్

తెలంగాణ లో ఎన్నికలు అయిపోయినా రాజకీయా వేడి తగ్గడం లేదు ఇప్పుడు  సీఎం రేవంత్ రెడ్డి.. మిషన్ భగీరథపై ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో.. తెలంగాణ గ్రామాల్లో జరిగిన మిషన్ భగీరథ పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సడెన్‌గా ఈ ఆదేశం ఇవ్వడానికి ఓ కారణం ఉంది. చాలా చోట్ల పైప్‌లైన్లు వెయ్యకుండానే వేసినట్లుగా, మెటీరియల్ కొనకుండానే కొన్నట్లుగా.. కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులు సృష్టించి, అడ్డగోలుగా మనీ నొక్కేశారనే ఆరోపణలు రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే ప్రాజెక్టులపై దర్యాప్తు జరిపిస్తామని తెలిపింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని తెలిపింది. ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంతోపాటూ.. మిషన్ భగీరథను తమ ప్రతిష్టాత్మక కార్యక్రమాలుగా చెప్పుకుంది. పల్లెల్లో ప్రతీ ఇంటికీ కుళాయి నీరు వచ్చేలా చేశామని గొప్పగా చెప్పుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒప్పుకోవట్లేదు. మిషన్ భగీరథ పేరుతో భారీగా దోచుకున్నారని ఆరోపిస్తోంది. ఇప్పుడు విజిలెన్స్ విచారణలో వెల్లడయ్యే విషయాలను బట్టీ, ప్రభుత్వ చర్యలుండే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం కృష్ణా, గోదావరి జిలాలకు సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం నడుస్తోంది. కృష్ణా జలాలపై నిర్ణయాధికారాన్ని కేంద్రం చేతిలో పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. అది తాము చెయ్యలేదనీ, బీఆర్ఎస్సే చేసిందని కాంగ్రెస్ అంటోంది. ఇలా ఈ రెండు పార్టీల మధ్యా ఈ వివాదం నడుస్తున్న సమయంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆదేశం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యిం