ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి నివాసం ఎందుకో తెలుసా ?
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు తన మార్కు రాజకీయాన్ని మొదలు పెట్టారు ఎనుమోలు రేవంత్ రెడ్డి ,ప్రజలకు ప్రవేశం లేని ప్రగతిభవన్ కాస్త ప్రజాభావన్ అయింది ,అందులో ఎప్పుడైనా ప్రజలు రావొచ్చు అని ప్రజా దర్భార్ ని కూడా ప్రారంభించారు రేవంత్ ఇప్పుడు ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభవన్‌ను ఇకపై ప్రజల కోసమే వినియోగిస్తారని అంతా భావించారు. కానీ, డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కొందరైతే సీఎం రేవంత్‌పై విమర్శలు మొదలు పెట్టారు. ప్రజాభవన్ అని చెప్పి భట్టికి ఎలా కేటాయిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే.. సీఎంను విమర్శిస్తున్నవారు.. భట్టికి కేటాయించడాన్ని తప్పు పడుతున్నవారు మర్చిపోతున్న విషయం ఏమంటే.. ప్రజాభవన్ పేరుతో ఉన్న ప్రాంగణంలో మొత్తం నాలుగు భవనాలు ఉన్నాయన్నది. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ నివసించిన భవనంతోపాటు.. మరో నాలుగు ఉన్నాయి. వీటిల్లో ఒకదాన్ని ఇప్పటికే ప్రజావాణి కోసం వినియోగిస్తున్నారు. మరో భవనాన్ని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (ఇందులోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ నివాసం ఉండేవారు) కేటాయించారు. మిగిలిన మూడు భవనాల్లో ఒక భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా.. రెండో దాన్ని ఎవరికైనా మంత్రికి కానీ.. లేదంటే రాష్ట్రానికి వచ్చే అతిధులకు వినియోగించుకోవటానికి కేటాయించనున్నారు. ఇందులోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నివాసం ఉండేవారు. మూడో భవనంలో ఎస్సీ.. ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.ప్రజాభవన్‌లోని ఐదు భవనాలు.. ఐదుగురికి కేటయించటం చూస్తే.. ఉన్న వనరుల్ని పూర్తిగా వినియోగించే తీరును సీఎం రేవంత్ ప్రదర్శించారని చెప్పాలి. అంతేకాదు.. ఈ మొత్తం భవనాల సముదాయాన్ని గతంలో ముఖ్యమంత్రి నివాసంగా ఉండేది. ఇప్పుడు అర్థమైందా? రేవంత్ తీసుకున్న నిర్ణయంలోని అసలు మర్మం. ప్రజావాణికి ఎలాంటి ఆటకం ఉండదు. పైగా పక్కనే డిప్యూటీ సీఎం ఇళ్లు ఉండడంతో ప్రజావాణికి వచ్చే అర్జీలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
Comments
0 comment