రేవంత్ రెడ్డి కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన యువతీ

దావోస్ పర్యటన ముగించుకుని పెట్టుబడులే లక్ష్యంగా లండన్ లో  పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. ఆయన అభిమానులు, కాంగ్రెస్ ఫాలోవర్లతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఓ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొనగా.. ఆయనను కలిసేందుకు చాలా మంది ఎన్నారైలు అక్కడికి చేరుకున్నారు. అందరిలాగే.. ఓ యువతి కూడా ఆ మీటింగ్‌కు వచ్చింది. కానీ.. అందరిలా సీఎంను కలిసి గ్రీట్ చేస్తే.. అరుదైన సన్నివేశం ఎలా అవుతుంది. తాను ఎంతగానో అభిమానిస్తోన్న స్టార్ హీరోను కలిసినప్పుడు ఓ ఫ్యాన్ ఎలా అయితే.. పట్టరాని ఆనందంలో కేరింతలు కొడతారో అలాంటి సీన్ అక్కడ చోటుచేసుకుంది.మీటింగ్‌కు వచ్చిన రేవంత్ రెడ్డిని చూసిన ఆ యువతి.. ఆయన స్టేజిపైన ఉండగానే.. ఓ ఫ్లవర్ బొకేను ఇచ్చి గ్రీట్ చేసింది. ఆ యువతి ఇచ్చిన బొకేను తీసుకున్న రేవంత్ రెడ్డి.. ఆమెను చూసి చిరునవ్వుతో పలకరించారు. దీంతో.. ఆ యువతి పట్టలేని ఆనందానికి లోనైంది. ఆ ఎగ్జైట్‌మెంట్‌లో చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ రేవంత్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. అంతేనా.. షేక్ హ్యాండ్ కోసం చేయు కూడా చాచింది. అది చూసిన రేవంత్.. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో.. ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయింది. సీఎం రేవంత్ సార్ అంటూ స్టేజ్ ముందు ఎగురుతూనే ఉంది. రేవంత్ రెడ్డిపై ఆ యువతి చూపిన అభిమానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.అయితే.. రేవంత్ రెడ్డిపై ఆ యువతి ఎగ్జైట్‌మెంట్‌.. అక్కడే ఉన్న ఓ కెమెరాలో రికార్డయింది. ఇప్పుడు ఆ వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ అన్నా మజాకా.. అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. లండన్‌లో రేవంత్ క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలోనే కాదు రేవంత్ అన్నకు ఎక్కడికి వెళ్లిన ఆయన అభిమానులు ఉంటారంటూ మిగతా వాళ్లు కామెంట్లు పెడుతున్నారు.