రేవంత్ రెడ్డి మంత్రి వర్గం లో ప్రొఫెసర్ కోదండరామ్ కు అవకాశం

తెలంగాణా మంత్రివర్గ విస్తరణ దిశగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ నాయకత్వంతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ..ఎంపీ అభ్యర్దుల పైన రేవంత్ హైకమాండ్ చర్చించనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో మంత్రివర్గంతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. లోక్ సభ అభ్యర్దుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇక, మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరనే చర్చ మొదలైందిమరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పైన ప్రచారం మొదలైంది. ఇటు రేవంత్ అలర్ట్ అయ్యారు. పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ కు ముందుగానే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు.ఇందు కోసం పార్టీ హైకమాండ్ తో చర్చించి అనుమతి తీసుకొనేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ తన మంత్రివర్గంలో కొత్త వారి జాబితా సిద్దం చేసినట్లు సమాచారం. ఈ జాబితాకు పార్టీ అధినాయకత్వం ఆమోద ముద్ర వేస్తే వెంటనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కోదండరామ్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. న్యాయపరమైన అంశాలతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా..ఆరు నెలల్లోగా చట్ట సభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో, మంత్రిపదవికి ఆయన పేరు ఖాయం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక, రేవంత్ మంత్రివర్గంలో ఇప్పటి వరకు అవకాశం దక్కని అదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కు ఈ సారి విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు