రోడ్డు ప్రమాదం లో మరణించిన తెలంగాణ BRS కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత
ఈమద్య రాజకీయ నాయకులకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ,అది నిర్లక్ష్యమొ లేక తలరాతో తెలియదు కానీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి ,నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన x ద్వారా తన సంతాపాన్ని తెలిపారు. “కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.“వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.నందిత కుటుంబ సభ్యులను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో వస్తారని తెలిసింది. బీఆర్ఎస్ నేతలు కూడా నందిత మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నా్రు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని తెలిసింది.హైదరాబాద్ ఓఆర్ఆర్ ఇవాళ తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 37 ఏళ్ల లాస్య నందిత కారులో కూర్చొని ఉండగా.. ఆమె ఫ్రెండ్, పీఏ అయిన ఆకాష్ కారు డ్రైవ్ చేశారు. ఐతే.. పటాచ్‌చెరు దగ్గర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు రైలింగ్‌ని ఢీకొట్టడంతో లాస్య నందిత స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆకాష్‌కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. 5 నిమిషాల్లోనే అక్కడకు వెళ్లి.. ఇద్దర్నీ పటాన్‌చెరులోని అమేధా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నందిత మృతదేహాన్ని అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆకాష్ ఇటీవలే పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో సెలెక్ట్ అయినట్లు తెలిసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు రాసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
0 comment