తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి
కష్టపడ్డవాడు ఎప్పటికైనా సుఖపడక మానడు అని రజనీకాంత్ డైలాగ్ మనందరికీ గుర్తు వుండేవుంటుంది ,నిజంగా అలంటి మాటలు కొన్ని కొన్ని సందర్భాలలో మనస్సుకి ధైర్యాన్ని ఇస్తాయి అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కేసుల్ని ఎదుర్కొని నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేసి ఇప్పుడు పార్టీ గెలుపు కి కారకుడైయ్యాడు అందుకే రేవంత్ కి అదృష్టం వరించింది అనేకంటే, కష్టపడ్డాడు ఫలితం దక్కింది అనుకోవచ్చు ,ఎందుకంటే అధిష్టానం రేవంతే సీఎం అని ప్రకటించడం రేవంత్ అభిమానులకు పండగైనా విషయం ,నిన్నటి సీఎల్పీ సమావేశం లో ఎమ్మెల్యే లు రేవంత్ రెడ్డి ని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు ,ఈ నెల్ 7 వతేదీన సీఎం గా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తారు
Comments
0 comment