తెలంగాణ స్పీఎకర్ గా భాద్యతలను స్వీకరించిన గెడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ స్పీఎకర్ గా భాద్యతలను స్వీకరించిన గెడ్డం ప్రసాద్ కుమార్ 

తెలంగాణ నూతన కార్యవర్గం ఏర్పాటు అయినా తరువాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలను  స్వీకరించారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రొటెం స్పీకర్ హోదాలో అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రకటించారు. అనంతరం ఆయన్ని స్పీకర్ కుర్చిలో కూర్చొబెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యుటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన అన్నీ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు.స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక విషయంలో కొనసాగిన మంచి సంప్రదాయమే ఇకపై కూడా కొనసాగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంక్షించారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని  శాసనసభ్యులు గురువారం స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేశారు.గడ్డం ప్రసాద్ కుమార్ ఒకప్పుడు  ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ,బాధ్యతలు నిర్వహించిన ప్రసాద్ కుమార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలి దళిత స్పీకర్ గా ఉన్నారు. గతంలో రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించింది. మొదటిసారి బీసీ సామాజికవర్గానికి చెందిన మధుసూదనచారి, రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఓసీ సామాజిక వర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్లుగా కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పదవిని తొలిసారిగా ఓ దళిత నేతకు అప్పగించిందిఅని రాజకీయ విశ్లేషకుల ప్రశంసలు రేవంత్రెడ్డి ప్రభుత్వం అందుకుంటుంది