తెలంగాణా ఎన్నికలకు అంతా సిద్ధం,నాయకులకు ఓటరే భవితవ్యం
తెలంగాణ ఎన్నికలకు అంతా సిద్ధమవుతుంది. ఓటరు చేతిలో నాయకుల బావితవ్యాలు వుండనున్నాయి ,ఐయిదు సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత నాయకుల తలరాతలు లికించే రోజు రేపు ,రేపు పోలింగ్ జరుగుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించి ఈవీఎంలతో పాటు సామాగ్రిని అందచేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగుతుంది. సమస్యాత్యక ప్రాంతాలను గుర్తించిన చోట కేంద్ర బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.63 లక్షల మంది మహిళ ఓటర్లుకాగా, 2,676 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. 1.62 లక్షల మంది పురుష ఓటర్లున్నారు. ఇందుకోసం మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12వేల సమస్యాత్మక కేంద్రాలు... ఇందులో దాదాపు పన్నెండు వేల పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు 9.99 లక్షల మంది కావడం విశేషం. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు. ఇందులో 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం ఇక్కడ మాత్రం... మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో 600 పోలింగ్ స్టేషన్లున్నాయి. ఇక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంధని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతుంది. పదమూడు నియోజకవర్గాలకే ఈ సమయం వర్తిస్తుంది.
Comments
0 comment