తెలంగాణా ప్రజలారా పుకార్లు నమ్మి మోసపోకండి
తెలంగాణ లో (కాంగ్రెస్ )రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీఠమెక్కింది,అలాగే భాద్యతలు చేపట్టిన వెనువెంటనే రేవంతా తన వాగ్దానాలను నిలబెట్టుకోవడం మొదలు పెట్టేసారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక మహాలక్ష్మీ పథకంలో భాగాంగా మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తమకు నెలకు రూ. 2500 వస్తాయని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇదే సమయంలో ఆ పథకానికి 18-55 ఏళ్ల లోపు మహిళలే అర్హులని ప్రచారం జరుగుతోంది. ఈ పథకం నుంచి లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని.. బ్యాంకు అకౌంట్ జీరాక్స్, పాస్ పోర్టు సైజ్ ఫోటో, కరెంట్ బిల్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది మహిళలు మీసేవా, బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహాలక్ష్మీ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తాయని.. ఆ తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని చెబుతున్నారు.
Comments
0 comment