తెలంగాణా రైతుబంధు లెక్కలివే

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడిననాటినుండి గులాబీ దళం చేసిన స్కాములన్ని బయటపెడతాము అని చెప్పకనే చెబుతుంది ,అయితే  ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం 68.99లక్షల మంది రైతుబంధు సాయం పొందుతున్నారు. వీరిలో ఎకరంలోపు భూమి ఉన్న వారు 22.55 లక్షల మంది ఉన్నారు. 1-2 ఎకరాలున్నవారు రూ.16.98 లక్షలు, 2-3 ఎకరాలు ఉన్న వారు 10.89లక్షలు, 3-4 ఎకరాలున్నవారు 6.64లక్షలు, 4-5 ఎకరాలున్నవారు 5.26లక్షల మంది ఉన్నారు. 62.34లక్షల మందికి 5 ఎకరాలలోపు భూమి ఉంది. మొత్తం రైతుల్లో 90%కిపైగా ఐదెకరాల్లోపు భూమిని మాత్రమే కలిగి ఉన్నారు.